Sunday, August 30, 2026
E-PAPER
Homeఆటలునీరజ్‌ చోప్రాకు గాయం

నీరజ్‌ చోప్రాకు గాయం

- Advertisement -

డైమండ్ లీగ్‌ ఫైనల్, ఆసియా గేమ్స్‌కు దూరం
న్యూఢిల్లీ
: భారత అథ్లెటిక్స్‌ ముఖచిత్రం, జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా గాయం బారిన పడ్డాడు. చీలమండ గాయంతో రానున్న రెండు ప్రతిష్టాత్మక ఈవెంట్లకు నీరజ్‌ చోప్రా దూరం అయ్యాడు. ఈ ఏడాది లసానె డైమండ్ లీగ్‌ ఫైనల్స్‌కు సహా 2026 ఆసియా క్రీడలకు నీరజ్‌ చోప్రా దూరమయ్యాడు. ఈ సీజన్‌లో వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో కామన్‌వెల్త్‌ క్రీడల్లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌ చోప్రా.. రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాడు. గత ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రాపై ఈసారి సైతం పసిడి ఆశలు భారీగా ఉన్నాయి. కానీ చీలమండ గాయంతో బాధపడుతున్న నీరజ్‌ చోప్రా కోలుకునేందుకు సమయం పడుతుందని.. పోటీ నుంచి తప్పుకున్నాడు. నీరజ్‌ చోప్రా స్థానంలో మరో ఆటగాడిని భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య ఆసియా క్రీడలకు ఎంపిక చేయనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -