Sunday, August 30, 2026
E-PAPER
Homeదర్వాజసన్ ఫ్లవర్

సన్ ఫ్లవర్

- Advertisement -

వెలుగులో ఉన్నప్పుడు
అందరూ
చుట్టూ వస్తారు
నీ చుట్టూ చేరి
ఉత్సవాలు చేస్తారు
ఆ వెలుగంతా
నీదేనని
నిన్నొక విగ్రహాన్ని చేస్తారు
పూల రేకులు
పన్నీటి జల్లులు కురిపిస్తారు
నీ చుట్టూ
పరిమళాలు వీస్తున్నాయని
నిన్ను ఉక్కరి బిక్కిరి చేస్తారు
నీ పూల రేకులును
దొంగిలిస్తారు
నీ సంతకాన్నిచెరిపేస్తారు
నీ చూపు కోసం
పరితపించిన వారు
నీ చుట్టూ
పరిభ్రమించిన వారు
ఒక్కొక్కరు
నీ దాపు నుండి
నీ మాటల తీగలను
తెంపుకుని తప్పుకుంటారు
ఎక్కడెక్కడి మబ్బులు చేరి
నిన్ను కమ్ముకున్న వేళ
నిన్ను ఒంటరిని చేసి
చీకటి రోదనలో
నిన్ను బందీని చేసి
మరో వెళుతురుకు
తోసుకుని వెళతారు
డా.సుంకర రమేశ్, 9492180764

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -