- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్లోని త్రిశూలి లోయలో బుధవారం ఉదయం సంభవించిన వరద విలయం నుంచి 1643 మంది పాఠశాల విద్యార్థులను ఒక ఉపాధ్యాయుడు చాకచక్యంగా రక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్ర దవాడికి ప్రమాద హెచ్చరిక అందగానే, వెంటనే అలారం మోగించి విద్యార్థులను బయటకు తరలించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వరదల్లో పాఠశాల భవనాలు కొట్టుకుపోతున్నప్పటికీ, విద్యార్థులు ఒక భారీ వృక్షం కింద ఆశ్రయం పొందారు. ఉపాధ్యాయుడి వేగవంతమైన స్పందన, సరైన నిర్ణయం వల్లే ఈ ప్రాణనష్టం తప్పింది.
- Advertisement -


