నవతెలంగాణ – సత్తుపల్లి : జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సత్తుపల్లిలో తాత్కాలిక ప్రాతిపదికన ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ నండ్రు గోపి ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీగా ఉన్న పోస్టులు: కంప్యూటర్ సైన్స్ (01), కామర్స్ (01), తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్య కమిషనర్ ఉత్తర్వుల మేరకు ‘డెమో విత్ ఇంటర్వ్యూ’ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఆయన తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో పీజీ 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50% మార్కులు సరిపోతాయని వివరించారు. ఎన్ఈటీ కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో కూడిన దరఖాస్తును కళాశాలలో నేరుగా సమర్పించాలని ఆయన తెలిపారు. 01-09-2026 (మంగళవారం) సాయంత్రం 4:00 గంటల లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని ప్రిన్సిపాల్ గోపి తెలిపారు.



