Saturday, September 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నీటి నాణ్యత ప్రమాణాల పరిశీలన

నీటి నాణ్యత ప్రమాణాల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
హర్ ఘర్ జల్ పథకం అమలులో భాగంగా బాల్కొండ మండల పరిధిలోని వన్నెల్ బి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ బక్కూరి వినోద ఆధ్వర్యంలో హర్ ఘర్ జల్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వినోద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకం అమలులో భాగంగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటి సరఫరా చేసేందుకు గ్రామంలో ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ద్వారా నీటి సరఫరా అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ ఏఈ వెంకటేశం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ  నీటి నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మిషన్ భగీరథ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -