- Advertisement -
నవతెలంగాణ-వనపర్తి
గోపాల్ దీన్నే సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి శేఖర్ రెడ్డి తల్లి బాలమ్మ అనారోగ్యంతో గత 18 రోజుల నుండి మహబూబ్ నగర్ ఎస్ వి ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జబ్బార్ లు ఆదివారం ఆస్పత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించారు. ఆరోగ్యం కుదుటపడాలంటే ధైర్యంగా ఉండాలని బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. బాలమ్మను పరామర్శించిన వారిలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి బాల్ రెడ్డి, ఎం రాజు, ఆఫీస్ కార్యదర్శి ఉమా తదితరులు ఉన్నారు.
- Advertisement -



