Sunday, August 30, 2026
E-PAPER
Homeజాతీయంఆర్ఎస్‌ఎస్-బీజేపీల భావజాలం దళిత వ్యతిరేక మనుస్మృతి

ఆర్ఎస్‌ఎస్-బీజేపీల భావజాలం దళిత వ్యతిరేక మనుస్మృతి

- Advertisement -
  • ఆర్ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఇండియన్ యూత్ కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన

నవతెలంగాణ-హైదరాబాద్: న్యూఢిల్లీలోని ఝండేవలన్‌లో ఉన్న ఆర్ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఇండియన్ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం నిరసన చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా మనుస్మృతి ప్రతిని దహనం చేశారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కార్యక్రమం తర్వాత వేదికను ‘శుద్ధి’ చేయడం అనేది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది దళితులకు, రాజ్యాంగ ఆత్మకే జరిగిన అవమానం అని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ మాట్లాడారు.. ఆర్ఎస్‌ఎస్-బీజేపీల భావజాలం ‘మనుస్మృతి’ ఆధారితమైనదని, అది “దళిత వ్యతిరేకమైనది” అని పేర్కొన్నారు. బీజేపీ-ఆర్ఎస్‌ఎస్‌లకు “కులతత్వ ధోరణి” ఉందని, ఆర్ఎస్‌ఎస్-బీజేపీ భావజాలం దళిత వ్యతిరేకమైన మనుస్మృతి అని, దేశంలో రెండు భావజాలాల మధ్య పోరాటం జరుగుతోంది, ఒకటి రాజ్యాంగం, మరొకటి బీజేపీ-ఆర్ఎస్‌ఎస్ భావజాలం. “ఈ కులతత్వ ధోరణికి వ్యతిరేకంగా మేము పోరాటం కొనసాగిస్తాము, ఎందుకంటే ఈ దేశం మనుస్మృతి ద్వారా కాదు, రాజ్యాంగం ద్వారా పాలించబడుతుంది,” అని ఆయన తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -