- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట
ఇటీవల మండల కేంద్రానికి చెందిన బోడుక ఆంజనేయులు అనారోగ్యంతో కన్నుమూశారు. విషయం తెసుకున్న జేకే ట్రస్ట్ డైరెక్టర్లు నర్సింహచారి, సుధాకర్ చారిలు సంయుక్తంగా వెళ్ళి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారి దశదిన కర్మకు ట్రస్ట్ ద్వారా 25 కేజీల బియ్యం, రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పుట్టి అంజయ్య మహేష్ తదితరులు ఉన్నారు.
- Advertisement -


