Monday, August 31, 2026
E-PAPER
Homeఆదిలాబాద్కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్షణ్ రావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారని బాసర సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్ సోమవారం తెలిపారు. సారంగాపూర్ మండలంలోని  ధని గ్రామంలో రైస్ మిల్లుకు సంబంధించిన సిఎంఆర్  వ్వవహారం లో  దయాల లక్షణ్ రావుతో పాటు మరో ముగ్గురు పై సారంగాపూర్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దింతో ఆదివారం రాత్రి నిర్మల్ సబ్ జైలుకు పోలిసులు వీరిని తరలించారు. పార్టీ క్రమశిక్షణలో భాగంగా తన మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మణ్ రావు  ఆదివారం రాత్రి నిర్మల్ లో  తనకు  తెలిపారని బాసర సర్పంచ్ నవ తెలంగాణకు సోమవారం ఫోన్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పని చేస్తానని పేర్కొన్నారని తెలిపారు. చిల్లర రాజకీయాలు తన తో కావాని ఆవేదన వ్యక్తం చేశాడని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -