- Advertisement -
- బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు)బిఎల్‌పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్
నవతెలంగాణ-కంఠేశ్వర్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అనుసరించే వారే నిజమైన వారసులవుతారని బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు)బిఎల్‌పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ 135 వ జయంతులు జరుగుతున్నాయని సుమారు 8 దశాబ్దాలకితం ఆయన చెప్పిన కొన్ని విషయాల్లో ప్రముఖంగా చర్చించబడుతున్న బ్రాహ్మణిజం, క్యాపిటలిజం భారతీయ సమాజాభివృద్ధికి ,పురోగమనానికి ప్రధానమైన అడ్డంకి మారాయని, ఈ రెండే శ్రామిక వర్గాలకు ప్రధాన శత్రువులని డాక్టర్ అంబేద్కర్ తన రచనల్లోని మూడో భాగం 17 వ వ్యాల్యూమ్‌లో చెప్పిన విషయాలకి ఇప్పుడు మరింత ప్రాధాన్యత వచ్చిందన్నారు. కులరహిత, వర్గరహిత సమాజం కోసం ఒకేసారి పోరాడాల్సిన అవసరమనివార్యమవుతుంది.
- Advertisement -



