నవతెలంగాణ – మద్నూర్
ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాదు-ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా బి.వెంకట్ మద్నూరులో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి, వందనాలను సమర్పించారు. తర్వాత జరిగిన సభలో వెంకట్ మాట్లాడారు.డా బి ఆర్ అంబేద్కర్ జీవిత సత్యాలపై కవితాగానమును చేశారు. అంబేద్కర్ అందరికి ఆదర్శప్రాయుడు అనే శీర్షికతో ఉన్న జీవిత సత్యాలను వెంకట్ వినిపించారు. వెంకట్ ఆలపించిన కవితాగానం సభను రంజింపజేసింది. ఇందుకు గౌరవంగా అంబేద్కర్ కార్యక్రమ కమిటీ సభ్యులు వెంకట్ ను శాలువా, అంబేద్కర్ శిరస్సు సాంప్రదాయ టోపీ తో సన్మానించారు. మద్నూరు గ్రామ పంచాయతి సర్పంచ్ ఉషాసంతోశ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, అంబేద్కర్ జయంతి కార్యక్రమ నిర్వాహక యువజన కమిటీ సభ్యులు మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కవి వెంకట్ కు అంబేద్కర్ కవితాగానం సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



