Wednesday, April 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణలో మండుతున్న ఎండలు..

తెలంగాణలో మండుతున్న ఎండలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలో వివిధ చోట్ల 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌తోపాటు నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్‌ జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌.. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు నిజామాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం నుంచి ఎండలు మరింత ఠారెత్తించే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -