నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ సీఎంగా నితిష్ కుమార్ రాజీనామా చేయడంపై బీహార్ ప్రతిపక్షనేత, ఆర్జేడీ అధినేత తేజిస్వీ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన రాజీనామాతో బీహార్ పాలన గుజరాత్ ఆధీనంలోకి వెళ్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్ కొత్త సీఎం ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కాదని విమర్శించారు. గాంధీ ఆశయాలతో పార్టీ స్థాపించిన నితిష్, రాజకీయ అవకాశాల కోసం బీజేపీని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘నితిష్ నాథూరామ్ గాడ్సే భావజాలం ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చారు. గతంలో కర్పూరీజీని దూషించిన వారిని ఆయన నిలబెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఎవరు అయినా, అది ప్రజల ఎంపిక కాదు… ముఖ్యమంత్రి ఎవరైనా సరే, ఇకపై బీహార్‌ను గుజరాత్ పాలిస్తుంది’ అని పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు.



