Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటర్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన సాధిక్ పాషా

ఇంటర్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన సాధిక్ పాషా

- Advertisement -

నూర్ బాషా సంఘం ఆధ్వర్యంలో సన్మానం 
నవతెలంగాణ – అచ్చంపేట
బల్మూర్ మండలం చెన్నారం గ్రామానికి చెందిన సాదిక్ పాషా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 470 మార్కుల గాను 467 మార్కులు సాధించి రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించాడు. వికారాబాద్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నల్లమల ప్రాంతానికి చెందిన విద్యార్థి మంచి మార్కులు సాధించడం పట్ల పలువురు సాదిక్ పాషా ను అభినందించారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అచ్చంపేట పట్టణంలో నూర్ బాషా సంఘం ఆధ్వర్యంలో సాథిక్ పాషను  వారి తల్లి పర్వీన్ బేగం ను సన్మానించారు.

విద్య రంగంలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను ప్రోత్సహించాలని నూర్ భాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఖాజమైనద్దీన్, ప్రధాన కార్యదర్శి ఎండి రజాక్ లు సూచించారు. భవిష్యత్తులో మరింత శ్రమించి విద్యారంగంలో ప్రతిభ కనబరిచి  పలువురికి ఆదర్శంగా ఉండేవిధంగా నిలవాలని వారు సూచించారు ఈకార్యక్రమంలో ఎండి బషీర్,తహెర్ పాషా,సాజిద్, షబ్బీర్, రవుఫ్ లక్ష్మాపూర్ బషీర్ మోయిన్ ఎండి జాఫర్ ,పాషా, ఆర్థిక కార్యదర్శి అహ్మద్, మక్బూల్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -