నవతెలంగాణ – నవాబు పేట
రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ ఐ విక్రమ్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని, లింగం పల్లి, లోకిరేవు గ్రామంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తున్న వాహనదారులను ఆపి రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా వాహనదారులను హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని మైనర్ డ్రైవింగ్ ,ర్యాస్ డ్రైవిం,గ్ మద్యం సేవించి వాహనాలు నడపరాదని పలు రకాల సూచనలను సలహాలను వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ ఆయా గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.



