80 ఏండ్ల ప్రస్థానంలో ఆద్యంతం ప్రజల పక్షమే
రాష్ట్ర నలుమూలల నుంచి హాజరు కానున్న 600 మంది ప్రతినిధులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈనెల 15 నుంచి 17 వరకు హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రజానాట్యమండలి 3వ రాష్ట్ర మహా సభలకు వేదిక కానుంది. ఈ సందర్భంగా సాయంత్రం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆనంగారి భాస్కర్ అధ్యక్షతన జరగనున్న సాంస్కృకోత్సవాలను రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిం చనున్నారు. కళ కల కోసం కాదు.. కళ ప్రజల కోసం.. కళ ప్రగతి కోసం అనే నినాదంతో ఏర్పడిన ప్రజానాట్యమండలి 80 ఏండ్లుగా తమ ఆట పాటతో ప్రజల పక్షాన నిలబడుతోంది. పాలకులు ప్రజా సమస్యలను విస్మరించిన ప్రతి సందర్భంలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ప్రజా కళాకా రులను తీర్చిదిద్దడంలో సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 600 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ సలహాదారు కేవి.రమణాచారి హాజరు కానున్నారు. విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ హీరో మాదాల రవి, నవతెంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్, నాటక రచయిత, దర్శకులు శాంతారావు, ప్రజానాట్య మండలి తెలంగాణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్, కార్యదర్శి కట్ట నర్సింహా, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.మారన్న హజరు కానున్నారు.
నేటి నుంచి ప్రజానాట్యమండలి 3వ రాష్ట్ర మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



