పీసీసీ మాజీ అధ్యక్షులు వీ హనుమంతరావు
నవతెలంగాణ – హైదరాబాద్
అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో హక్కును కల్పించిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కే దక్కుతుందని పీసీసీ మాజీ అధ్యక్షులు వీ హనుమంతరావు అన్నారు. మంగళవారం అంబర్‌పేట్‌లో శ్రీరమణ థియేటర్ సమీపం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పెడుతూ భారత రాజ్యాంగాన్ని విచ్ఛినం చేస్తున్నారని విమ ర్శించారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ప్రధానకార్యదర్శి ఆర్.లక్ష్మణ్‌యాదవ్, టీపీసీసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అఫ్సర్లయూసఫ్ జాయి, పీసీసీ రాష్ట్ర కార్య దర్శులు శంభుల శ్రీకాంత్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు పుల్ల నారాయణస్వామి, పులి జగన్, గరిగంటి రమేష్, దిండి రాంబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తిబాబు, కష్ణా గౌడ్, రామ్మోహన్, ఈడెల్లి ప్రభాకర్, షేక్ జమీర్, గడ్డం శ్రీధర్‌గౌడ్, పంజాల వెంకటేష్, కోటం అనిల్, రావుల సుధాకర్, సి సుధాకర్, మహేష్ గౌడ్, మెట్టు ధనరాజ్, ఖాదర్ షరీఫ్, ఠాగూర్, హరి, తిలక్ సింగ్, జాంగిర్ భారు, ఫరీద్ భారు, రవి, శ్రీనివాస్ రెడ్డి, సందీప్ గౌడ్, కోట్ల కిరణ్, హలీం బారు, సమత్ భారు, భగవాన్, రాఘవ, లక్ష్మణ్, శ్రీకాంత్, సునీల్ గౌడ్, భాను యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నాయకులు విజితా రెడ్డి, శాంతమ్మ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సలీముల్లా, తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు హక్కులు డా.బీఆర్ అంబేద్కర్ ఘనత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



