హైదరాబాద్ : డెవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌లు ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. సుదీర్ఘ విరామం తర్వాత సన్‌రైజర్స్ బ్యాటర్లు ఇద్దరు ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచారు. రాజస్తాన్ రాయల్స్‌పై 44 బంతుల్లో 91 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 22 స్థానాలు ఎగబాకాడు. హెన్రిచ్ క్లాసెన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 2 అర్థ సెంచరీలు సహా 224 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 2 అర్థ సెంచరీలతో 213 పరుగులు చేయగా, వైభవ్ సూర్యవంశీ 2 పిఫ్ట్సీతో 200 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వైభవ్ డకౌట్ కావటంతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి పడిపోయాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 200 ప్లస్ పరుగులు చేసిన బ్యాటర్లుగా క్లాసెన్, కిషన్, వైభవ్ నిలిచారు.



