Wednesday, April 15, 2026
E-PAPER
Homeఆటలునెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్‌

నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్‌

- Advertisement -

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు సిద్ధం?
చెన్నై
: చెన్నై సూపర్‌కింగ్స్‌ స్టార్‌ క్రికెటర్‌ ఎం.ఎస్‌ ధోని గాయం నుంచి కోలుకుంటున్నాడు. పిక్క గాయంతో ఐపీఎల్‌కు రెండు వారాల పాటు దూరమైన ఎం.ఎస్‌ ధోని.. ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. మంగళవారం చెపాక్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మ్యాచ్‌ ముంగిట నెట్స్‌లో ధోని బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. సహాయక సిబ్బంది త్రోడౌన్స్‌ వేయగా ధోని బ్యాటింగ్‌ చేశాడు. ధోని ప్రాక్టీస్‌ సెషన్‌ను బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ పర్యవేక్షించాడు. సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌లకు గువహటి, బెంగళూరు వెళ్లని ధోని.. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లకు సైతం స్టేడియానికి జట్టుతో పాటు వెళ్లలేదు. ఈ శనివారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే ఎం.ఎస్‌ ధోని ఉప్పల్‌ స్టేడియంలో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనుండగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆడేదీ లేనిది తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -