సాకర్ దిగ్గజం డీగో మారడోనా ఇల్లు పేదల ఆకలిని తీర్చే కమ్యూనిటీ కిచెన్‌గా మారింది. బ్యూనోస్ ఎయిర్స్ శివారులోని విల్లా ఫ్లోరిటో ఇంట్లో జన్మించిన మారడోనా.. బాల్యంలో కఠిన పేదరికం చూశాడు. రక్షిత మంచినీరు, వీధి రోడ్డు లేని ఇక్కడి నుంచి మారడోనా ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్‌గా ఎదిగాడు. 1986లో అర్జెంటీనాకు ప్రపంచకప్ టైటిల్‌ను అందించాడు. ప్రభుత్వ విధానాలు, రవాణా-ఎనర్జీ సబ్సిడీలను ఎత్తివేయటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. కొనుగోలు శక్తి పడిపోవటంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆకలి తీర్చేందుకు కొందరు వాలంటీర్ల బృందం మారడోనా ఇంటిని కమ్యూనిటి కిచెన్‌గా మార్చి ఆహారం అందిస్తోంది. మారడోనా ఇంటిని నేషనల్ హిస్టారికల్ సైట్‌గా అర్జెంటీనా ప్రభుత్వం 2021లో గుర్తించింది.



