Sunday, August 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంహైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్

హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్

- Advertisement -

సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌‌రెడ్డి భేటీ
​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు లండన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తెలిపారు. ఈ మేరకు శనివారం లండన్ యూనివర్సిటీ సెనేట్ హౌస్‌లో సీఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా విస్తృత స్థాయిలో విద్యా కోర్సులు, వివిధ విద్యా కార్యక్రమాలను అందించేలా ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వివరించారు. లండన్ యూనివర్సిటీకి చెందిన వివిధ విద్యా విభాగాలను ఒకే అకడమిక్ ఫెడరేషన్‌గా అనుసంధానించే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయని సీఎంకు వారు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ అధికారులు కే. రామకృష్ణారావు, జయేశ్ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -