పీఎస్‌ఎల్ కాదని ఐపీఎల్‌కు ఆడటంపై సీరియస్
కరాచీ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానిపై వేటు వేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ముజరబాని ఆడకుండా రెండేండ్ల పాటు నిషేధం విధించింది. ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు ముజరబాని తొలుత కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కానీ టీ20 ప్రపంచకప్ తర్వాత ముజరబానిని ఐపీఎల్ ప్రాంఛైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ కాంట్రాక్టు కోసం ముజరబాని పీఎస్‌ఎల్ కాంట్రాక్టు వదులుకున్నాడు. దీంతో ముజరబానిపై సీరియస్‌గా ఉన్న పీసీబీ అతడిపై చర్యలు తీసుకుంది. ‘క్రమశిక్షణ కమిటీ సమీక్ష అనంతరం జింబాబ్వే క్రికెటర్ ముజరబాని పీఎస్‌ఎల్‌లో ఆడేందుకు రెండేండ్ల పాటు అనర్హుడు. లీగ్, ఆటగాళ్ల మౌలిక ఒప్పందం ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని’ పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ముజరబాని (29) ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4/41 ప్రదర్శనతో రాణించిన సంగతి తెలిసిందే.
ముజరబానిపై పీసీబీ వేటు
- Advertisement -
- Advertisement -



