Wednesday, April 15, 2026
E-PAPER
Homeఆటలుఘనా చీఫ్‌ కోచ్‌గా కార్లోస్‌

ఘనా చీఫ్‌ కోచ్‌గా కార్లోస్‌

- Advertisement -

2026 ఫిఫా ప్రపంచకప్‌
న్యూఢిల్లీ :
కార్లోస్‌ ఖ్వరోజ్‌ (73) ఫిఫా 2026 ప్రపంచకప్‌లో ఘనాకు చీఫ్‌ కోచ్‌గా పని చేయనున్నారు. 2026 వరల్డ్‌కప్‌కు ఒమన్‌ అర్హత సాధించలేదు, దీంతో ఆ జట్టు బాధ్యతల నుంచి కార్లోస్‌ తప్పుకున్నారు. గత మూడు ఫిఫా ప్రపంచకప్‌ల్లో ఇరాన్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించిన కార్లోస్‌.. అందరి దృష్టిని ఆకర్షించాడు. 2010 ఫిఫా ప్రపంచకప్‌లో కార్లోస్‌ మేనేజర్‌గా పోర్చుగల్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ‘అసోసియేషన్‌తో కలిసి పని చేస్తున్న అందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ కార్లోస్‌ను ఘనా చీఫ్‌ కోచ్‌గా ఎంపిక చేసింది’ అని ఘనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. పోర్చుగీసు కాలనీ మొజాంబిక్‌లో జన్మించిన కార్లోస్‌.. ఈజిప్ట్‌, జపాన్‌, కొలంబియా, దక్షిణాఫ్రికా జట్లకు కోచ్‌గా పని చేశాడు. ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో క్రొయేషియా, ఇంగ్లాండ్‌, పనామాతో ఘనా తలపడనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -