– కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ రక్షణ కోసం కృషి చేయడమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు అర్పించే నిజమైన నివాళి అని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అన్నారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదమరాజు, కేవీపీఎస్ సీనియర్ నాయకులు బొల్లి చెన్నయ్య, బాగ్యమ్మ లతో కలిసి మంగళవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం స్కైలాబ్ బాబు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ పైకి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కుతూ మరో వైపు ఆయన ఆశయాలను తొక్కుతుందని విమర్శించారు.’మాకు 400 సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తాం’అని బీజేపీ మంత్రులే ప్రకటించారని గుర్తు చేశారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారే.. మనుస్మృతి విధానాలను అమలు చేస్తున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గాన్ని ఐక్యం కానీయకుండా కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల మొత్తం మహనీయుల మాసంగా పాటిస్తున్నట్టు చెప్పారు. 26న హైదరాబాద్‌లో కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.
రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



