గురుకుల విద్యార్థినిని సన్మానించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – మిడ్జిల్
టాలెంట్ ఎవరి సొత్తు కాదని, చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన విద్యార్థి మౌనికను, వారి తల్లిదండ్రులను మాజీ మంత్రి డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించారు. మంగళవారం కావేరమ్మ పటలో మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థిని మౌనికను స్థానిక నాయకులతో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద విద్యార్థుల విద్యా బలోపేతానికి గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసి నాణ్యమైన విద్యను అందించామని తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరంలో 440 మార్కులకుగాను 438 సాధించి స్టేట్ ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులకు, గ్రామానికి నియోజకవర్గానికి పేరు ప్రతిష్టలు తీసుకువచనందుకు అభినందించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువుల కోసం ప్రవేశపెట్టిన మైనారిటీ గురుకుల ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తల్లిదండ్రులు మిపైన పెట్టుకున్న ఆశలను నిజం చేయాలని అన్నారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్, జిల్లా నాయకులు బాలు, కొత్తపల్లి మాజీ సర్పంచ్ వెంకటయ్య, సుకు కుమార్, వెంకటసాగర్, మంద భీమ్ రాజ్, గ్రామస్తులు శ్రీనివాసులు, రాజు, వివిధ గ్రామాల సర్పంచ్ లు మండల మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



