Tuesday, April 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దాహార్తిని తీర్చడానికే చలివేంద్రం ఏర్పాటు 

దాహార్తిని తీర్చడానికే చలివేంద్రం ఏర్పాటు 

- Advertisement -

• సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ 
నవతెలంగాణ పెద్దవంగర
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు పెద్దవంగర సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉందని, ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఆర్థిక స్తోమత కలిగిన దాతలు విరివిగా గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనపురం వినోద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిలుక దేవేంద్ర సంజీవ రావు, గద్దల ఉప్పలయ్య, అనపురం శ్రీనివాస్, ఏదునూరి రాములు, సుంకరి ఓంకార్, చిలుక సంపత్, యాకయ్య, చంద్రమౌళి, యాకయ్య, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -