నవతెలంగాణ – మిడ్జిల్
అట్టడుగు ఉన్న వర్గాల ప్రజలకు రాజ్యాంగ ఫలాలు ప్రభుత్వాలు అందించాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో గ్రామపంచాయతీలలో సర్పంచుల అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటాలకు, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా 135 అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చేసిన సేవలు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు మండల శాఖ అధికారులు ఎడ్ల శంకర్ ,చంద్రయ్య గౌడ్, శశికళ, సుజాత మల్లికార్జున రెడ్డి, మాధవి మల్లేష్, నాగరాజు గౌడు, నాయకులు దేవయ్య, వెంకటయ్య, బాలయ్య, బాల్ రెడ్డి, బాలు, సుదర్శన్, విజయ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటయ్య, సుకుమార్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



