నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయనతో పాటు భార్య బుష్రా బీబీలను ఇకపై ఏకాంత నిర్బంధంలో ఉంచడాన్ని పాకిస్థాన్ కోర్టు నిషేధించింది. అలాగే, జైలు నిబంధనల ప్రకారం ఖాన్ ఆయన భార్యల మధ్య సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) అడియాలా జైలు అధికారులను ఆదేశించింది. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. పలు అవినీతి సంబంధిత కేసులలో నేరం రుజువు కాబడి 2023 ఆగష్టు నుంచి సుదీర్ఘ జైలు శిక్షలను అనుభవిస్తున్నారు. ఇటీవల ఖాన్ ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు నెలల తరబడి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల నేపథ్యంలో ఆయనను షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు గత నెలలో ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరోసారి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



