- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు మంగళవారం విస్తృతంగా చేపట్టారు. పలు వార్డుల్లో డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించారు. ప్రజలు చెత్త, చెదారం మురికి కాల్వల్లో, రోడ్లపై వేయద్దని, పంచాయతీ అధికారులు సూచించిన స్థలాల్లో వేస్తే సిబ్బంది తొలగిస్తారని చెప్పారు.
- Advertisement -



