నవతెలంగాణ – జుక్కల్
ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారించాలని మంగళవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. 206 సంఘాలతో ఏర్పాటు చేసిన టీజీఈజేఏసి పిలుపుమేరకు మండల కేంద్రంలో సామూహిక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా, మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. సిపిఎస్ ని వెంటనే రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయాలని, రెండవ పిఆర్సి వెంటనే అమలు చేయాలనీ, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలనీ, ఆరు డిఏ లను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లుల కొరకు నెలకు రూ.2000 కోట్లు విడుదల చేసి సకాలంలో చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమం చేపడుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిటియు అధ్యక్షుడు కాంబ్లే గోపాల్ , టి టి యు మండలాధ్యక్షుడు కాంబ్లే సాయిలు, టి పి యు ఎస్ మండల అధ్యక్షుడు జై చంద్, టీఎన్జీవో మండలాధ్యక్షుడు కాంబ్లే నాగయ్య, జిపిఓల మండల అధ్యక్షుడు సాయిలు, శ్రీనివాస్ సంగ్రం హిందీ ఫోరం ఉపాధ్యాయులు, ఎం పీఓ రాము తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని ఎంపీడీఓకు వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



