Wednesday, April 15, 2026
E-PAPER
Homeఖమ్మంఅగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాల్లో అవగాహన కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా అశ్వారావుపేట లో అగ్ని ప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జూపల్లి శశికళ ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రజలు అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.చిన్న నిర్లక్ష్యమే పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు.

అశ్వారావుపేట ఫైర్ స్టేషన్ అధికారి షేక్ సైదులు మాట్లాడుతూ, గృహాలు, దుకాణాలు, విద్యాసంస్థల్లో అగ్ని భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఎలక్ట్రికల్ లోపాలు, గ్యాస్ లీకేజీలు వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఫైర్ సిబ్బంది అగ్ని ప్రమాదాల సమయంలో ఉపయోగించే పరికరాలను ప్రదర్శించి, వాటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -