Wednesday, April 15, 2026
E-PAPER
Homeసినిమాఅందరికీ నచ్చే 'బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌'

అందరికీ నచ్చే ‘బ్యాడ్ బాయ్‌ కార్తీక్‌’

- Advertisement -

హీరో నాగ శౌర్య, దర్శకుడు రామ్‌ దేశినా (రమేష్‌) కాంబోలో తెరకెక్కుతున్న ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‌’.
శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా మేకర్స్‌ గ్రాండ్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ, ‘రసూల్‌ ఈ సినిమాలో నన్ను చాలా బాగా చూపించారు. ఆయన వల్ల ఈ సినిమా విజువల్స్‌ అద్భుతంగా వచ్చాయి. మా హీరోయిన్‌ విధికి ఇది తెలుగులో ఫస్ట్‌ సినిమా. ఆమెకు ఇది మంచి లాంచ్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీదేవితో పనిచేయడం చాలా మంచి అనుభవం. ఆమె ప్రభాస్‌ మొదటి సినిమాలో చేశారు. నాకు కూడా అలాంటి లక్‌ రావాలని కోరుకుంటున్నాను. సాయికుమార్‌, వెన్నెల కిషోర్‌, సుదర్శన్‌, సముద్రఖని.. ఇలా చాలా పెద్ద తారాగణం ఈ సినిమాలో ఉంది. డైరెక్టర్‌ రమేష్‌, మా నిర్మాతలు చాలా కష్టపడి సినిమా తీశారు. వారికి మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది అని నమ్ముతున్నాను’ అని తెలిపారు.
‘ఎన్ని కష్టాలు వచ్చినా నిర్మాత శ్రీనివాస్‌ ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాతో ఆయనకు మంచి సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను. ఆయన మరిన్ని మంచి సినిమాలు తీయాలి. రసూల్‌ లేకపోతే ఈ జర్నీ ఇలా పూర్తి అయ్యేది కాదు. ఈ సినిమా విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నేనూ థియేటర్‌లో ఈ సినిమా చూడడానికి వెయిట్‌ చేస్తున్నాను’ అని శ్రీదేవి విజయ్‌ కుమార్‌ చెప్పారు. నిర్మాత శ్రీనివాస్‌ చింతలపూడి మాట్లాడుతూ, ‘ఇది మా ఫస్ట్‌ సినిమా. ఈ సినిమాలో శౌర్యని ఒక డిఫరెంట్‌ స్టైల్‌లో చూస్తారు. ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా బాగుంటాయి. జూన్‌లో మరో సినిమా మొదలుపెట్టబోతున్నాం’ అని తెలిపారు.
డీఓపీ రసూల్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా నా కెరీర్‌లో ఒక మంచి అనుభవం. కొన్ని కారణాల వల్ల సినిమాను కష్టాలు పడుతూ తీశాం. కానీ సినిమా అద్భుతంగా వచ్చింది. థియేటర్‌లో చూసిన తర్వాత చాలామంది సర్ప్రైజ్‌ అవుతారు. సినిమాలో చాలా మంచి అంశాలు ఉన్నాయి. ఆడియన్స్‌ ఖచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -