Wednesday, September 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదేశం ఇక నిశ్శబ్దంగా ఉండదు

దేశం ఇక నిశ్శబ్దంగా ఉండదు

- Advertisement -

విద్యార్థుల గొంతుకలే శక్తివంతమైన ఆయుధాలు
జెన్‌-జీ పోరాటం ఇంతటితో ఆగదు
ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి గోష్
కరీంనగర్‌, హనుమకొండల్లో జెన్‌ జీ సెమినార్ విజయవంతం

న‌వ‌తెలంగాణ – క‌రీంన‌గ‌ర్ ప్ర‌తీయ ప్ర‌‌తినిధి/నయీంనగర్‌/
హనుమకొండ చౌరస్తా
​విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడం ద్వారానే విజయాలు సాధ్యమవుతాయని, హక్కుల సాధన కోసం విద్యార్థి లోకం ఇక ఎంతమాత్ర‌‌మూ నిశ్శబ్దంగా ఉండబోద‌ని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి గోష్ అన్నారు. కరీంనగర్, హనుమకొండ జిల్లా కేంద్రాల్లో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జెన్‌-జీ’ సెమినార్లలో ఆమె ప్ర‌‌సంగించారు. దేశంలో అణచివేతను ఎదిరిస్తూ ప్రశ్నించే గొంతుకలు ఒక్కటవుతు న్నాయని చెప్పారు. ఢిల్లీ వీధుల్లో జరిగిన చారిత్రాత్మక విద్యార్థి పోరాటా లు కేంద్ర పాలకవర్గాన్ని సైతం ఆలోచనలో పడేశాయన్నారు. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ లక్షలాది మంది విద్యార్థులు ఐక్యంగా నిలబడ్డారని గుర్తుచేశారు. విద్యార్థుల గొంతుకలే అత్యంత శక్తివంతమైన ఆయుధాలని, ఎంతటి పెద్ద సమస్యలనైనా ఎదుర్కొని సామాజిక మార్పు కోసం పోరాడే సత్తా నేటి యువతకు ఉందని అన్నారు. ఈ దేశంలో సమస్య ఎక్కడ ఉన్నా విద్యార్థులు తమ హక్కుల కోసం, విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ధైర్యంగా ముందుండి పోరాడా లని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా విద్యార్థి, నవతరం హక్కుల కోసం సాగుతున్న సమరం మరింత ఉధృతం కానుందని అన్నారు.

పాలకుల ప్రజావ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక విధా నాలపై యువతరం ఇకపై ఎంతమాత్రం నిశ్శబ్దంగా ఉండబోదని హెచ్చరిం చారు. దేశంలో విద్యార్థుల హక్కుల సాధన కోసం నడుస్తున్న ఈ పోరాటం తాత్కాలికం కాదని స్పష్టం చేశారు. విద్యా రంగాన్ని కార్పొరే టీకరణ, కాషాయీకరణ వైపు తీసుకెళ్తున్న పాలకుల కుట్రలను జెన్‌-జీ తరం సమర్థవంతంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. అణచి వేత, భయానక వాతావరణం సృష్టించి యువత గొంతు నొక్కాలని చూస్తే సాధ్యం కాదని, సోషల్‌ మీడియా వేదికల నుంచి వీధి పోరాటాల దాకా జెన్‌-జీ ప్రశ్నించడం నేర్చుకుంటోందని స్పష్టం చేశారు. ఉపాధి లేమి, ఫీజుల పెంపు, స్కాలర్‌షిప్‌ రద్దు, విద్యా సంస్థల్లో ప్రజాస్వామ్య హక్కుల కాలరాతపై యువత తిరగుబాటు చేస్తున్నదని చెప్పారు. ప్రతి విశ్వ విద్యాల యంలోనూ విద్యార్థులు, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి ఎస్‌ఎఫ్‌ఐ కట్టుబడి ఉందని తెలిపారు. క్యాంప స్‌లలో ఫాసిస్టు, విభజన శక్తుల ఆటల ను సాగనివ్వబోమని తేల్చి చెప్పారు.

​విద్యార్థి విప్లవం ప్రారంభమైంది: 
రాష్ట్ర నాయకత్వం
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థి విప్లవం మొదలైందని, ఇటీవల పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ సమస్యలపై నిరసన తెలపడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ విద్యారంగ వ్యతిరేక విధానా లను అవలంబిస్తున్నారని విమర్శిం చారు. పాలకులకు ప్రజా సమస్యల కంటే రాజకీయాలే ముఖ్యమ య్యా యని, ఇకనైనా విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారి హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ ఆశయాల సాక్షిగా హక్కుల సాధన కోసం జెన్‌-జీ యువతను ఏకం చేసి మరిన్ని ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని ప్రకటించారు. సెమినార్లలో ఎస్ఎఫ్ఐ కరీంనగర్‌ జిల్లా అధ్యక్షులు అరవింద్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్ మానస, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంజన, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, బోగేష్, ఈసాక్, ఆకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, మమత, సుమ, రవి, హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు మధు, స్మరణ, రాజ్‌, లవ కుమార్‌, గణేష్‌, వినోద్‌, రవితేజ, బిరెడ్డి జశ్వంత్‌ చెన్నూరి, సాయికుమార్‌, నాగరాజ్‌, పవన్‌ కుమార్‌, ఈశ్వర్‌,హేమంత్‌, సాయి తేజ, గోపి, సాయి, శ్రీధర్‌, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -