అనుష్క శెట్టి లీడ్‌రోల్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఘాటి’. అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.
దీని తర్వాత తమిళ స్టార్ విక్రమ్ ప్రభు ఇంటెన్స్ అవతార్‌లో కనిపించిన క్యారెక్టర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇది సినిమాపై ఉన్న బజ్‌ను మరింత పెంచింది.
యువి క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సోమవారం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ గురించి అప్‌డేట్ ఇచ్చారు. జూలై 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అనుష్క, విక్రమ్ ప్రభు నదీ ప్రవాహంలో సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి. సక్సెస్ ఫుల్ మూవీ ‘వేదం’ తర్వాత అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ కలిసిన చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్. అలాగే యువీ క్రియేషన్స్‌తో కలిసి అనుష్క నాలుగోసారి వర్క్ చేయడం మరో విశేషం.
హై బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈచిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి, ప్రెజెంట్స్: యువీ క్రియేషన్స్, బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, కథ: చింతకింది శ్రీనివాసరావు,
ఎడిటర్: చాణక్య రెడ్డి తూరుపు, వెంకట్ ఎన్ స్వామి, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ క్రిషన్.
భిన్న కాన్సెప్ట్‌తో ‘ఘాటి’
- Advertisement -
- Advertisement -