- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హిమాలయ దేశం నేపాల్‌ను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 1,127కు చేరినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. వారం రోజులైనా వేలాది మంది ఆచూకీ తెలియకపోవడంతో సైన్యం, పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. చిత్వాన్‌లో 348, నవల్పరాసి ఈస్ట్‌లో 217, నవల్పరాసి వెస్ట్‌లో 190, నువాకోట్‌లో 155 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా వందలాది మంది గల్లంతవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సాయం అందిస్తున్నారు
- Advertisement -



