కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా ‘కలర్ ఫొటో’, ‘బేబి’ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శక, నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మరో సినిమాకి ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. సోమవారం ఈ సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని అమత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథని అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
‘తొలి ప్రేమేం తోపు కాదు, ఫస్ట్ లవ్ ఫెయిలైతే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలువుతుందని..’ చెబుతూ సాగిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్‌లో కనిపిస్తు న్నారు. శ్రీ గౌరి ప్రియ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రెస్ చేసింది. సముద్రపు ఒడ్డున ఈ జంట ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ గురించి మాట్లాడుకున్న సంభాషణ ఆసక్తికరంగా, ఆలోచింపజేసేలా సాగింది. అంతం వరకు అనంతమై సాగే ఈ జీవితంలో తొలి ప్రేమ ఒక మజిలీ మాత్రమేనని, అదే తుది కాదనే కాన్సెప్ట్‌ను ఈ గ్లింప్స్ ద్వారా మేకర్స్ అందంగా తెలియజేశారు. ఈ గ్లింప్స్‌కు ‘తొలి ప్రేమే తోపు కాదే తోపు కాదే..’ అంటూ మణిశర్మ బ్యూటిఫుల్ బీజీఎం సాంగ్ కంపోజ్ చేశారు.
తొలి ప్రేమ ఓ మజిలీ మాత్రమే..
- Advertisement -
- Advertisement -