– ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై నవీన్ కుమార్…
నవతెలంగాణ- మునుగోడు
గ్రామీణ స్థాయి క్రీడలే రాష్ట్రస్థాయి క్రీడలకు పునాది అవుతాయని మునుగోడు ఇంచార్జ్ ఎస్ఐ నవీన్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామస్థాయి క్రీడా పోటీ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో తమ ప్రతిభను ప్రత్యేకతను కనబరిస్తే యువతకు ప్రజలలో మంచి గుర్తింపు పెరుగుతుందని పేర్కొన్నారు .క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహంతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కలీల్ , డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు కట్ట లింగస్వామి, కట్ట వెంకన్న, వరికుప్పల ముత్యాలు, అయితగోని విజయ్, నారగోని నరసింహ, బొందు అంజయ్య, పగిళ్ల మధు, సిహెచ్ బిక్షం, కట్ట ఆంజనేయులు, పి యాదయ్య, సిహెచ్ ఫ్రేమ్, బొందు సుందరయ్య, కుక్కల బాలస్వామి, కార్తీక్ తదితరులు ఉన్నారు