- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని బెళగావి జిల్లా ఇంచల్ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలకు 14 పురాతన బంగారు నాణేలు దొరికాయి. మొత్తం 54.8 గ్రాముల బరువున్న ఈ నాణేల విలువ సుమారు రూ.8.20 లక్షలు. వీటిపై ఒకవైపు ఏనుగు బొమ్మ, మరోవైపు పురాతన డిజైన్ ముద్రించి ఉన్నాయి. ఇవి 800 నుంచి 1000 ఏళ్ల నాటివని అధికారులు భావిస్తున్నారు. పురావస్తు నిపుణుల పరిశోధన తర్వాత వీటి కాలంపై స్పష్టత రానుంది. కూలీలు నిజాయితీగా ఈ నాణేలను అధికారులకు అప్పగించారు.
- Advertisement -



