Thursday, April 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సుద్దవాగులో పడి వ్యక్తి ఆత్మహత్య

సుద్దవాగులో పడి వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ- కుభీర్
మద్యం మానేయాలని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నా సంఘటన కుభీర్ మండలంలోని సౌంలీ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. సాంవ్లి గ్రామానికి చెందిన టేకెవార్ పీరాజి (56) ప్రతి రోజు మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై ఇంట్లో తరుచు గొడవ జరగడంతో మనస్తాపం చెంది బుధవారం ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు గ్రామస్తుల చుట్టూ ప్రక్కల వెతకగా గ్రామ శివారులోని సుద్దవాగులో పీరాజి మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు సాయినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -