Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కిడ్నీ తొలిగింపు ఘటనపై జిల్లా వైద్యాధికారి విచారణ 

కిడ్నీ తొలిగింపు ఘటనపై జిల్లా వైద్యాధికారి విచారణ 

- Advertisement -

 ఆస్పత్రిని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వై సూర్య శ్రీ  
నవతెలంగాణ-ఆలేరుటౌను  

ఆలేరు పట్టణంలోని అర్బితా నర్సింగ్ హోమ్ లో కిడ్నీ  తొలగింపు  ఘటనపై వైద్యులపై విచారణ  చేపట్టామని, యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని వై సూర్య శ్రీ తెలిపారు. శనివారం ఆస్పత్రిని సందర్శించారు. కిడ్నీ తొలగింపు ఘటన గురించి వైద్యులను విచారించారు. గర్భసంచిలో కణతి శాస్త్ర చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన మహిళ కిడ్నీ తొలగింపు ఘటన, పట్టణంలో సంచలనం సృష్టించింది. నిర్వాహకులను విచారించారు.

యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కమలమ్మ కొన్ని రోజుల క్రితం గర్భసంచి సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందగా, చికిత్స అనంతరం ఆమె స్కానింగ్ తీయగా, కిడ్నీ లేదని విషయం బటబైలైంది.  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలతో  విచారణ చేపట్టినట్లు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి వై సూర్యశ్రీ తెలియజేశారు. ఘటనపై విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -