Saturday, September 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అప్రకటిత కరెంట్ కోతలు..ఇబ్బందుల్లో ప్రజలు

అప్రకటిత కరెంట్ కోతలు..ఇబ్బందుల్లో ప్రజలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల,నాచారం గ్రామాల్లో అప్రకటిత కరంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురివుతున్నట్లుగా వాపోతున్నారు. శనివారం నాచారం గ్రామంలో మాజీ సర్పంచ్ కాసాని రామయ్యతోపాటు పలువురు ప్రజలు ఆందోళన చేపట్టారు.గత వారం రోజులుగా నిత్యం సాయంత్రం 6గంటల నుంచి 9 గంటల వరకు అప్రకటిత విద్యుత్ కోతతో చికటివేళల్లో ఒకవైపు దోమలు మరోవైపు విషపు పాములు,పురుగులతో భయాందోళనకు గురివుతున్నట్లుగా వాపోతున్నారు.విద్యుత్ కోతలపై సంబంధించిన అధికారులను అడిగితే పై నుంచే కరెంట్ కోతలు ఉన్నాయని తాము చేసేదేమిలేదంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధించిన ఉన్నతాధికారులు పట్టించుకోని విద్యుత్ కోతలు లేకుండా చూడలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -