Sunday, September 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినవ్విపోదురుగాక..!

నవ్విపోదురుగాక..!

- Advertisement -

బట్టలపై ఎన్ని మరకలున్నా వాషింగ్‌‌మెషిన్‌‌లో వేస్తే శుద్ధి అయి బయటకు వచ్చినట్టుగానే ఎన్ని అవినీతి మరుకలున్నా బీజేపీలో చేరితే చాలు నిజాయితీ లీడర్లు అయిపోతారనే విమర్శ రాజకీయవర్గాల్లో ఇప్పటికే ఉంది. ఏ పాటి అవకాశమున్నా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి అధికారం దక్కించుకోవడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. కానీ, అధికారానికి చాలా దూరంగా ఉన్న రాష్ర్టాల్లో మాత్రం నలుగురూ ‘నవ్విపోదురుగాక మాకేంటి సిగ్గు’ అన్నట్టుగా నీతులు వల్లిస్తున్నారు. రాష్ట్రంలో కొండా సురేఖ రాజకీయ ఎపిసోడ్‌ ‌నడుస్తున్న నేపథ్యంలో ‘రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తాం’ అంటూ కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా…మరికొందరు జాతీయ నేతలేమో ‘ఎవ్వరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకోం’ అంటూ నీతిసూక్తులు చెబుతుండటంపై…. ‘మీ పార్టీలోకి అవినీతి మరకలున్న నేతలనే చేర్చుకుంటారా? సార్‌’ అనే మీమ్స్‌ ‌పుట్టుకొస్తున్నాయి.
అచ్చిన ప్ర‌శాంత్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -