పరిశోధన
మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలానికి చెందిన గ్రామం దుండిగల్‌లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ ప్రాంగణంలో అగుపించిన శాసనాన్ని గురించి తెలుసుకోవడానికి నర్సగారి జగన్ కొత్త తెలంగాణ చరిత్రబృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్‌కు పంపించాడు. ఈ శాసనస్తంభాన్ని దిండిలోని చిన్నచెరువు దగ్గర నుంచి తెచ్చారని ఆలయపూజారి చెప్పాడు. స్తంభం సరిగా మధ్యలోకి విరిగిపోయివుంది. శాసనస్తంభానికి మూడువైపులలో 11వ శతాబ్దాపు తెలుగన్నడలిపిలో, కన్నడభాషలో, 41పంక్తులలో శాసనం చెక్కివుంది. శాసనం మొదట చంద్రుడు, సూర్యుడు, జైన తీర్థంకరుడు, ఆవు, దూడలు చెక్కివున్నాయి.
కళ్యాణీచాళుక్య చక్రవర్తి త్రిభువనమల్లదేవ 6వ విక్రమాదిత్యుడు(పాలనాకాలం-క్రీ.శ.1076-1126) కళ్యాణీపురం నెలవీడు(తాత్కాలిక శిబిరం)లో ఉన్నపుడు వేయించిన శాసనమిది. అనేక ప్రశస్తులున్న అతని మహామండలేశ్వరుడు, సోమవంశానికి చెందిన వాడు దేవేం(ద్రుడు…పేరున్నచోట రాయి పగిలిపోయింది) చెక్కించిన దానశాసనం. జినపాద భక్తితో ‘‘శ్రీలలన(శ్రీలక్ష్మిని)బోలు నాలమ’’ జైన శాసనదేవతకు బసది నిర్మాణం చేయించింది. మండలేశ్వరునిచే ఎన్నో మర్తురుల(మర్తురు=ఒకటిన్నర ఎకరం)భూమి దానం చేయబడ్డది. ఈ కార్యక్రమంలో ముప్పన పాల్గొన్నాడని శాసన పరిష్కారం చేసిన శ్రీరామోజు హరగోపాల్ వివరించాడు. గతంలో చరిత్రబృందానికి వరంగల్ జిల్లా చింతనెక్కొండ మండలంలోని గ్రామంలో ఇట్లే సగం విరిగిన స్తంభశాసనం లభించింది. తెలంగాణాలో జైనమతప్రాభవానికి నిదర్శనంగా జైనశాసనాలు ఇప్పటికి అక్కడక్కడ లభిస్తున్నాయి.
దుండిగల్ శాసనం
1వ వైపు చంద్రుడు, సూర్యుడు కాలాముఖగురువు ఆవుదూడ, శ్రీశ్రీ,
1.స్వస్తి సమస్త భువనాశ్రయ శ్రీప్రిథ్వీవల్లభ మహారాజాధిరాజ (రాజ)
2.పరమేశ్వర పరమభట్టారక సత్యాశ్రయకులతిలకం చాళుక్యాభరణం,
3.శ్రీమత్రిభువనమల్లదేవ(ర) విజయరాజ్యముత్తరొత్తరాభి,
4.వ్రిద్ధి ప్రవర్థమానమాచంద్రార్కతారంబర సలుత్తు కళ్యా,
5.ణపురద నెలవీడ… సుఖసంకతావినోదదిం రాజ్యంగెయ్యు(త్త)
6.మిరేతత్పాదపద్మోపజీవి11 స్వస్తి సమధిగత పంచమహా(శ)
7.బ్ద మహామండలేశ్వరం రిపుహరత్రిపుర మహేశ్వరం సమస్త వి..
8.పారావార పారాయణ(సు) భటనారాయణం సకళ లక్ష్మినివా(స)
9.కీర్తివిలాసం సంగ్రామరామం పరాక్రమభీమం మండళీక మ…..
10. దర్పణం విబ్ద సంతర్పణం కలిగలంకు సంపుర్ణము..ద్దేసంకొ….
11. యాం గణగ్రిహ మంగళతోరణం పంపనగంధవారణం….మా..
12. స్వామిద్రోహరగండం సోమవంసాపిరసరశ్చ శ్రీమండళికదేవేం
13. ..తి..హ్రిదయసేల్లం సమలకమల్లం నిజిశా….దంత
2వ వైపున
1….. దిప్పువరూమగు…
2…..ణము యాప్పుదునినగేం
3.దు లోకమెల్లం పొగల్వరు తప్పి
4…ద చరిత్రం ముప్పనయు
5.దాంగలశ్చ్మి నాలమ జగదొప్ప
6.శాసనదేవత నాలమకాగ
7.ళణ దొలగె నెగల్దదుందుమిగడ
8…ళు(లే)సాగిభక్తియందం శాగ..
9.వానిప్పె బసదియం మాడిసిదలె
10.శ్రీలలనంబోలు (భూ)మిన భూ
11.లలనంబొలు తాల్పి హిద్వినివాకు
12.శ్రీలలనబోలు నాలమబొల
13.రు పొల్పగ సతులు భువన
14…లోన..జినపదభక్తియందన
3వ వైపున
1.మూడణ కరంబమ
2.(త్త)రడుయల్లియ ఇప్పే
3…ల్పత్తేరడు బసదియ
4…తొంటం మత్తరొడు మ
5..తొవొండు దేవమానం గ..
6.ళెవల్లియోబ్బలబత
7…యమదుందు మిగడల..
8…త్తియాగికొట్టురుమ..
9.హిదం నాగలూరలు సో
10…దియుంయల్లియ ప్ర…
11.మిగదలా సోమ జెస…
12.వ్రిత్తిబెట్టిదకుం….
13….యుదుం పలా..
14….తరొం మయా…
15. ………..
శాసనం గుర్తింపు: నర్సన్నగారి జగన్, దుండిగల్
శాసన పరిష్కారం: శ్రీరామోజు హరగోపాల్, అధ్యక్షులు, కొత్త తెలంగాణ చరిత్రబృందం-9949498698
దుండిగల్ జైనబసది దానశాసనం
- Advertisement -
- Advertisement -



