హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని మహిళా హకార డెయిరీ వెనకాల.. కాటమయ్య గుండు మీద చెక్కివున్న గణపతి, వేదిభద్రపీఠం మీద శివలింగం, పక్కన నంది, మహిషాసురమర్దిని అర్ధ(ఎంబోజ్డ్)శిల్పాలున్నాయి. వాటిపైన సూర్యచంద్రులు, పైన పెద్ద అక్షరాలలో చెక్కిన శాసనం అద్భుతం. కానీ, ఈ బల్లపరుపు మీద మనుషుల కార్యకలాపాలవల్ల శాసనలిపి చెరిగిపోయింది. భక్తి, విశ్వాసాల కారణంగా శిల్పాలు, శాసనం దక్కాయి. ఆ రాతిగుండుకు ఎదురుగా మొక్కుబడి నాగశిలలున్నాయి. రాతిగుండు మీద శిల్పాలు రాష్ట్రకూటానంతర శైలిలో చెక్కబడినవి. కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధక సభ్యుడు జి.కిశోర్ అన్వేషణతో ముల్కనూరులో కొత్త శాసనం వెలుగుచూసింది. శిథిలాక్షరాల కారణంగా ఈ 10వ శతాబ్దపు తెలుగన్నడలిపి, కన్నడభాషా శాసనవివరాలు మితంగా తెలుస్తున్నాయి. చదువగలిగినంత వరకు ఈ శాసనంవల్ల కళ్యాణీచాళుక్యుల పాలనాకాలంలో ‘సమధిగత పంచ మహాశబ్ద’ ప్రశస్తిగల మహాసామంతుడు (బిజ్జన) సం. తెలియని చైత్రశుద్ధ ద్వాదశినాడు ముల్కలూరులో నీర్నేలను దానం చేసినట్టు తెలుస్తున్నదని కొత్త తెలంగాణ చరిత్రబృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ వివరించారు.
శాసన పాఠం:
స్వస్తిసమధిగత పంచమహాశబ్ద మహాసామన్త సత్యాశ్రయ పన్వయని..ల…….హిధరం తని త్సర వంశ… కాలాన ల……య్వస్యొవంన్రి పరాదేయం త్రొయ్యటిలి.. పంపి.. కలాయుగ…లిమ్వన్నిశివం బిజ్జన(ది)రాజ.. నయ్య(న్వీ)పరాదేయ.. య్యదిలి.. మల్లదేవనచత్ర..త.. మపని….. విజయరాజ్యముత్తరోత్తర.. ప్రిథ్వి ప్రవర్ధమానమాచంద్రరారార్కం పిరర… నేయ…… త్సరదచైత్ర సుద్ద12 ఆదిత్యవారదందు ముల్కలూరరొన్ద ఆయ్తి… సకతిద…… క…… నెన్దొ…. ఱేయ పేఱగణ నిర్నేలం బీవ్వరమలొనితారత్తి పమలుతొఱ్వం…. అప్రితియా….డుది…. మ.. సలిసువమ.. లమకలతరలి.. రొజ్య…. గియ్య…. ససన్రారూ(డి) మవ్వ…….. మదత్తియా… సలిసి ప్రతిపాది… నదసి…. ధర్మసేతు నపాణాం కాలేకాలే పాలనీయో భవద్బిః భూయో యాచతే రామచంద్రా……
ఫీల్డ్ రీచర్చర్ : జి.కిషోర్, 9440716935,
డెసిఫరింగ్ : శ్రీరామోజు హరగోపాల్, 9949498698
కొత్త తెలంగాణ చరిత్ర బృందం
మహాసామంతుని ముల్కనూరు దానశాసనం
- Advertisement -
- Advertisement -



