ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స నిలకడగా ఆరోగ్యం
న్యూఢిల్లీ : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్ నాయకులు, పశ్చిమ బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిమన్ బసు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య పరిశోధన సంస్థ (ఎయిమ్స్) ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని శనివారం సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ సలీం తెలిపారు. బిమన్‌బసుకు ఎయిమ్స్‌లో శస్త్ర చికిత్స నిర్వహించారని, ఆయన నిలకడగా కోలుకుంటున్నారని చెప్పారు. కాగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ కూడా బిమన్‌బసు ఆరోగ్యానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన పోస్టు చేసింది. లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిమన్ బసుకు గుండె సంబంధిత ఎలెక్టివ్ పెర్క్యుటేనియస్ హార్ట్ వాల్వ్ ఇంప్లాంటేషన్ చికిత్స నిర్వహించారని, పేస్‌మేకర్ (గుండె స్పందనను ప్రేరేపించే చిన్న పరికరం) అమర్చారని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని పేర్కొంది.
బిమన్‌బసుకు అస్వస్థత
- Advertisement -
- Advertisement -



