అమెరికా ‘మిస్టర్ సింగ్’ ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు
న్యూఢిల్లీ : భారతీయ ట్రక్ డైవర్లకు వ్యతిరేకంగా అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం జారీ చేసిన ప్రకటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటన భారతీయులందరికీ అవమానమని, మోడీ బలహీనమైన ప్రభుత్వమే ఇలాంటి ప్రకటనకు కారణమని విమర్శించింది. భారతదేశ ప్రయోజనాలను సమర్థిస్తూ.. ఈ ప్రకటనపై అమెరికాను మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోతోందని, ఈ విషయంపై దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పేర్కొంది. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్‌లో చేసిన పోస్టర్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆ పోస్టర్‌పై తలపాగాతో ఉన్న వ్యక్తికి ఎదురుగా ఒక రోబో నిల్చొని.. ‘‘మిస్టర్ సింగ్.. మా రోడ్లను వదిలిపెట్టండి. మీకు డ్రైవింగ్ రాదు’’ అని హెచ్చరించినట్టుగా ఉంది. పైగా ‘‘మీ అంతట మీరుగా దేశాన్ని వీడండి .. లేదంటే పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అధికారులు ఆ పోస్టర్‌పై పేర్కొన్నారు.
మోడీ బలహీన ప్రభుత్వమే కారణం
- Advertisement -
- Advertisement -



