Friday, April 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబ్యాండ్‌ వాయిద్య కళాకారుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు

బ్యాండ్‌ వాయిద్య కళాకారుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బ్యాండ్‌ కళాకారుల హక్కులు, సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. వాయు కాలుష్యం పేరుతో పోలీసుల వేధింపులను ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్యాండ్‌ కళాకారులపై పోలీసుల నిర్బంధం ఆపాలి, వెహికిల్‌ సీజ్‌ చేయకూడదు అనే డిమాండ్లతో తెలంగాణ బ్యాండ్‌ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సురేందర్‌ సేఠ్‌ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ ఏడాది వంద రోజుల పెళ్లిళ్ల సీజన్‌లో ఉపాధి దొరికే కళాకారుల వెహికిల్స్‌ సీజ్‌ చేయడమేంటని? ఆయన ప్రశ్నించారు. వాయు కాలుష్యం పేరుతో నెలల తరబడి వాహనాలను పోలీస్‌ స్టేషన్లలో ఉంచితే వారి ఉపాధి దెబ్బతిని రోడ్డున పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న పేద బ్యాండు కళాకారుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శిం చారు. పోలీసులు తీసుకొచ్చిన జీవో 227పై స్పందించి వెంటనే సౌండ్‌ కంట్రోల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ఆదేశాల పేరుతో కళాకారులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి నెలల తరబడి కోర్టులకు తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాండ్‌ కళాకారులకు సరైన మార్గదర్శకాలను ఇచ్చి వెహికిల్‌ సీజ్‌ చేయ కుండా ఆదుకోవాలని కోరారు. కరోనా తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ గుండెకు సంబంధించిన సమస్యలపై ఇచ్చిన హెల్త్‌ బులెటిన్‌, కోర్టు సూచనల మేరకు మార్గదర్శకాలు విడుదల చేసి ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ బ్యాండ్‌ వాయిద్య కళాకారుల సంఘం (బీవీకేఎస్‌) రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నాగరాజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ ముఖ్య మంత్రి, బ్యాండ్‌ మేళం వారితో పోలుస్తూ కించపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులందరు బ్యాండ్‌ కళాకా రులని సంబోధించాలని కోరారు. నిబంధ నలు పాటిస్తున్న పోలీసులు వేధిస్తూనే ఉన్నారని చెప్పారు. సీజ్‌ చేసిన వాహనాన్ని 30 రోజుల పాటు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచితే ఉపాధి దెబ్బతిం టుందని తెలిపారు. సౌండ్‌ బ్యాన్‌ చేస్తున్న ట్టు సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్‌ లైన్స్‌లో లేవని స్పష్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో సౌండ్‌ నిషేధాన్ని పాటిస్తు న్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ డీజే సౌండ్‌ను నిషేధిస్తున్నట్టు చెప్పలేద న్నారు. బ్యాండ్‌ కళాకారుల పరిక రాలకు 18 శాతం జీఎస్టీని చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వృత్తి సంఘాల నాయకులు పైళ్ల ఆశయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు మాట్లాడారు. పలువు రు బ్యాండ్‌ వాయిద్య కళాకారుల సంఘం నాయకులు తాము ఎదుర్కొం టున్న సమస్యలను వివరిం చారు. ఈ సమావేశంలో హన్మంతు, ప్రవీణ్‌, అనిల్‌, గరుడ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -