Sunday, September 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతీవ్ర విషాదం..ఈతకు వెళ్లిన ఇద్దరు గల్లంతు

తీవ్ర విషాదం..ఈతకు వెళ్లిన ఇద్దరు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్‌: పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వెలిగొండ ఫీడర్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన మార్కాపురం జిల్లా కటకానిపల్లెలో జరిగింది. పుప్పాల రాజ్‌కుమార్(22), పుప్పాల వినయ్ కుమార్ (23) వరుసకు అన్నదమ్ములు. సోమవారం రాజ్‌కుమార్ పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెళ్లికి వచ్చిన ఏడుగురు స్నేహితులతో కలిసి రాజ్‌కుమార్ శనివారం ఈతకు వెళ్లాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అన్నదమ్ములిద్దరూ కాలువలో కొట్టుకుపోయారు. రాత్రి వరకు గాలించినా వారి ఆచూకీ దొరకలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -