Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెయ్యిరోజుల కాంగ్రెస్‌ పాలనలో అన్నీ వైఫల్యాలే

వెయ్యిరోజుల కాంగ్రెస్‌ పాలనలో అన్నీ వైఫల్యాలే

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఎన్నికల సమయంలో ప్రజలకు 420 హామీలిచ్చి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యిరోజుల విధ్వంసకర పాలనకు నిరసనగా ఆదివారం బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి వై. గోవింద్‌ స్వచ్చతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెయ్యిరోజుల పాలనలో ఒక్క హామీ కూడా అమలు చేయలేని, చేతకాని, అసమర్ధ పార్టీ కాంగ్రెస్‌ అన్నారు. హామీలు అమలు చేయకుండా బీఆర్‌ఎస్‌ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకుని, కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష‍ాలపై నోరుపారేసుకోవడం ఆపి, పాలనపై దృష్టిపెట్టాలనీ, సీఎం హోదాకు తగ్గట్టుగా రేవంత్‌రెడ్డి హుందా తనం ప్రదర్శించాలనీ హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -