•ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షులు గంట రాజు
నవతెలంగాణ-మర్రిగూడ
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఈనెల 8, 9,10 తేదీలలో జరిగే ఏఐవైఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ మండల ఉపాధ్యక్షులు గంట రాజు పిలుపునిచ్చారు.ఆదివారం మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.ఏఐవైఎఫ్ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తుందని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.మండలం నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ బుర్ర శేఖర్,కార్యవర్గ సభ్యులు ఎరుకల నిరంజన్ గౌడ్,జక్కల అంజయ్య యాదవ్,ఎండి నజీర్,కిరణ్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



